calender_icon.png 12 November, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలి

12-11-2025 08:41:33 PM

ఆయా శాఖల అధికారులతో సమావేశం..

మండల ప్రత్యేక అధికారి జీవరత్నం..

ఖానాపూర్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లను ఈ నెలలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని మండల ప్రత్యేక అధికారి జీవరత్నం అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను త్వరితగా పూర్తి చేసి లబ్ధిదారులు ఈ నెలలోనే గృహప్రవేశాలు చేసే విధంగా వారికి ఇండ్లను అందజేయాలని అన్నారు. అంతేకాకుండా ఆయా గ్రామపంచాయతీలో సానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. 

పాఠశాలలో విద్యార్థులకు మెనూ సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తీర్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రత్నాకర్ రావు, ఏఈ రాంసింగ్, సిడిపిఓ శ్రీలత, ఆయా శాఖల మండల అధికారులు గ్రామపంచాయతీ సెక్రటరీలు తదితరులున్నారు. అంతకుముందు బావా పూర్ (కె) పాత ఎల్లాపూర్, బీర్నంది, ఇందిరమ్మ ఇల్లు , పాఠశాలలు సందర్శించారు.