2 July, 2026 | 2:24 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

30-05-2025 12:28 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

అమనగల్లు, మే 29: అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి  నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం అమనగల్లు మండలంలోని రాము నుంతల అంబేద్కర్  పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిక పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు స్థానిక నేతలతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. లబ్ధిదారులంతా సకాలంలో ఇల్లు నిర్మించుకోవాలని నిర్మాణ దశలను బట్టి వారికి బిల్లులు మంజూరు అవుతాయని ఆయన హామీనిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి అని ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని...

ప్రతిపక్ష పార్టీలకు తమ అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,ఏవో శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో మాజీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్వేతా ఆనంద్, యాట నరసింహ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.