2 July, 2026 | 3:36 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

జనభేరి విజయంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తాం

30-05-2025 12:28 AM

-జిల్లా అభివృద్ధిలో కంకణబద్ధులం అవుతాం

-బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్

వనపర్తి, మే 29 ( విజయక్రాంతి ) : సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం నిర్వహించిన జనభేరి బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చి మమ్మల్ని ఆశీర్వ దించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.

గురువారం వనపర్తి పట్టణం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బుదవారం నిర్వహించిన జనభేరి సభ సక్సెస్ వెనుక బీసీ పొలి టికల్ జేఏసీ నాయకుల సమిష్టి కృషి దాగి ఉందన్నారు.

సభను విజయవంతం చేయాలని కేవ లం ఒక్క పిలుపు ఇవ్వడంతో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 20 వేల మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని, దీంతో మాపై బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.

మేము జనభేరి సభ ద్వారా ప్రజల ముందు పెట్టిన డిమాండ్లను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు పరిష్కరించాలని, లేదంటే బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి, వారిని గెలిపించుకుని సమస్యలు కూడా మేమే పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాల్గొన్నారు.