7 March, 2026 | 11:30 AM

అర్హు లైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు

06-03-2026 01:34 AM

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

హుజూర్ నగర్, మార్చి 5: అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. పట్టణంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించ నున్నట్లు తెలిపారు.

గురువారం మోడల్ హౌసింగ్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు బ్లాకులు, అంతర్గత రోడ్లు, సభాస్థలిని, పార్కింగ్ పరిశీలించి పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వారంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని,అర్హత లేని వారికి జాబితాలో పేరు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి,సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ,ఆర్డీవో శ్రీనివాసులు, చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చెర్మన్ తన్నీరు మల్లికార్జున్,తహసిల్దార్ కవిత,తదితరులు పాల్గొన్నారు.