23 April, 2026 | 4:19 AM

బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు మిత్తీలు కడుతున్నాం

09-12-2024 12:50 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు 

వనపర్తి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ హయాంలో రూ.లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల కూపంగా రాష్ట్రాన్ని మార్చిందని, ఆ అప్పులకు తమ ప్రభుత్వం మిత్తీలను కడుతూనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఆబ్కారి, పర్యాటక సాంస్కృత్రిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఆదివారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి వనపర్తి జిల్లాలో రూ.136 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం వ నపర్తిలో మీడియా సమావేశంలో మంత్రి జూప ల్లి మాట్లాడుతూ.. మహామేధావి అని చెప్పుకునే మాజీ మంత్రి వనపర్తి జిల్లా ఏర్పాటు కోసం తనను ఎన్నోసార్లు బతిమిలాడిన విషయం మర్చిపోవద్దన్నారు.

అనంతరం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడారు. ఈ నెల 21న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రూ.200 కోట్ల ఎంఎస్‌ఎంఈ రుణాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేందు కు మెగా రుణమేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారె డ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో సుబ్రహ్మణ్య, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ కార్యనిర్వాహక ఇంజనీర్ దేశ్యానాయక్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహేశ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణయ్య పాల్గొన్నారు.