2 July, 2026 | 5:01 AM

ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

05-06-2025 12:30 AM

కడ్తాల్, జూన్ 4 : భారతీయ జనతా పార్టీ కడ్తాల మండల శాఖ ఆధ్వర్యంలో  బుధవారం కడ్తాల్ ఎంపీడీఓ సుజాత కు వినతి పత్రం అందించారు. కడ్తాల్  మండలంలో ఇండ్లు లేనటువంటి పేదవారికి  ఇందిరమ్మ కమిటీలు,అధికారులు నిజమైన అర్హులను గుర్తించి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ గృహాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బి జెపి మండల అధ్యక్షులు దోనాదుల మహే ష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాలె శ్రీశైలం గౌడ్, రాష్ట్ర బిజెవైయం  అధికార ప్రదినిధి కంటేకర్ భగీరత్, మాన్యనాయక్, నింగ్యారి యాదగిరి, సిద్దిగారి కుమార్, నేనావత్ ప్రేమ్ కుమార్, గడ్డం వెంకటేష్, విక్రాంత్ చారి, తుప్పరి శ్రీను తదితరులుపాల్గొన్నారు.