23-11-2025 06:46:52 PM
పోక్సో కేసు నమోదు..
అచ్చంపేట: మైనర్ బాలికపై లైగికంగా వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై తెలిపారు. అలాగే నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసికేసు నమోదు చేశామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.