23-11-2025 06:44:36 PM
నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం..
చిట్యాల (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇచ్చే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాల వారికి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లాయిపల్లి కాల్వ ద్వారా గ్రామంలోని పెద్ద చెరువును నింపడం జరిగిందని, త్వరలోనే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా కూడా నీటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కిష్టాపురం, ఇప్పర్తి గ్రామాలకు రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని, రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ రుణాలు మంజూరు చేయిస్తామని అన్నారు.
గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, సింగిల్ విండో చైర్మన్ రఘుమా రెడ్డి, ఎంవిహెచ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీశైలం, మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, మాజీ ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మయ్య, పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి, జనగాం అంజయ్య గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, అంతటి పారిజాత నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.