గుర్జకుంటలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశం
28-03-2026 12:34 AM
భిక్కనూర్, మార్చి 27 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం గుర్జకుంటా గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వస్త్రాలు సమర్పించారు. గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఇళ్లు అందడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్యాల సుదర్శన్, గ్రామ సర్పంచ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.




