శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తి రిమాండ్
మునిపల్లి, జులై 13 :మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మునిపల్లి ఎస్‌ఐ అరవింద్ హెచ్చరించారు. మండలంలోని మొగ్దుంపల్లి గ్రామానికి చెందిన దర్లపల్లి నర్సింలు అనే వ్యక్తి బుధవారం మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగించాడు.
ఈ విషయాన్ని గ్రామానికి చెందిన కొంతమంది మునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్‌ఐ అరవింద్ తన సిబ్బందితో కలిసి మొగ్దుంపల్లి గ్రామానికి చేరుకొని జరిగిన విషయాలను ప్రజలకు అడిగి తెలుసుకొని ప్రజలకు అసౌకర్యం కల్పించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్లు నిర్దారించారు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా జడ్జి లక్ష్మికళ ఒక రోజు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ అరవింద్ తెలిపారు.






