23 June, 2026 | 11:59 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

బాలకార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పరిశ్రమ యజమానులు

10-11-2025 12:00 AM

* మైనర్ బాలికలతో పనులు 

గుమ్మడిదల, నవంబర్ 9 :పాఠశాలకు వెళ్లి చదవాల్సిన వయసులో పరిశ్రమకు వెళ్లి కూలి పని చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసిస్తున్న మైనర్ బాలికలతో పరిశ్రమలో పనిచేయిస్తున్న వైనం గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డు కెమి ప్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో వెలుగు చూసింది. బాలల హక్కుల చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండని వారిని ఎటువంటి పరిశ్రమలో కూలీలుగా పనిచేయించ రాదనే నిబధన ఉన్నప్పటికీ పరిశ్రమ యజమానులు, కాంట్రాక్టర్లు మైనర్లతో పని చేయిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై ప్రశ్నిస్తే మైనర్ బాలికలతో ఎటువంటి పనులు చేయించడం లేదని, వారి విద్యాభ్యాసం చేయక పోవడం తాము కారణమా అని పరిశ్రమ యజమానులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి చైల్ లేబర్ అధికారులు బాల కార్మికులను గుర్తించి కంపెనీ యజమానులపై, కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.