calender_icon.png 10 November, 2025 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాము కాటుతో బాలుడి మృతి

10-11-2025 12:00:00 AM

  1. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో ఘటన
  2. పీహెచ్‌సీలో డాక్టర్ లేకపోవడంతోనే అందని యాంటీ డోస్ ఇంజెక్షన్?
  3. బాలుడి మృతదేహంతో కుటుంబీకుల ధర్నా 

కన్నాయిగూడెం, నవంబరు 9 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో.. పాము కాటుకు గురైన బాలుడికి టీకా అందక ప్రాణాలు వదిలాడు. కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవూల గ్రామానికి చెందిన తిరునగిరి రాజు, సంగీత దంపతుల కుమారుడు హరినాథ్ (7) ఆదివారం ఇంటి ఆవ రణలో ఆడుకుంటుండగా పాము కాటేసింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెం టనే కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ పాము కాటుకు యాంటీ డోస్ ఇంజక్షన్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమి లేక నాటు వైద్యం (పసరు మందు)పోశారు. అయినా విషం విరుగుడు కాకపోవడంతో బాలుడి పరిస్థితి విషమించింది. 108 అంబులెన్సులో ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. డాక్ట ర్ ఉండి ఉంటే ప్రాణం దక్కేదంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించా రు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు ప్రాణాలు పోయాయని ఆసుపత్రి వద్ద బాలుడి మృతదేహంతో కుటుంబ స భ్యులు, గ్రామస్థులు ఏటూరునాగారం, తుపాకులగూడెం ప్రధాన రహదారిపై సుమారుగా 2గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. డ్యూటీ డాక్టర్‌ను విధుల్లో నుంచి సస్పెండ్ చేసి, కలెక్టర్ విచారణ చేసి మృతుని కుటుంబానికి న్యాయం చే యాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.