23-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 22(విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా రు.
10 లక్షల తో నిర్మించనున్న వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మోడల్ స్కూల్లో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మోడల్ స్కూల్లో వసతులు,విద్య బోధన,బోజన వసతి గురించి తెలుసుకొని, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, నాణ్యమైన విద్యాబోధనకు కృషి చేస్తుందన్నారు.
ఉపాధ్యాయులకు సైతం వేసవిలో నూతన సాంకేతికత పై కోచింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సాంకేతికత పై విద్య బోధన జరుగుతుందని వివరించారు.జగిత్యాల నియోజకవర్గం కు 9 సెన్స్ ల్యాబ్ లు మంజూరు అయ్యాయన్నారు.విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడం ద్వారా నాణ్యమైన భోజన వసతి అందుతుందన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎంఈఓ గాయత్రి,ఎంపీఓ రవి బాబు, డి ఈ మిలింద్,ఏఈ రాజ మల్లయ్య,మాజీ సర్పంచ్ లు రజిత శేఖర్,బొడ్డు దామోదర్,ప్రిన్సిపాల్ సరిత దేవి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.