calender_icon.png 23 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

23-08-2025 01:15:40 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మణుగూరు,(విజయక్రాంతి): విద్యార్థులకు  నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని  మహాత్మా జ్యోతి బాఫూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ  రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరా లను సమగ్రంగా పరిశీలించారు.

హాస్టల్ తనిఖీ సమయంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించి, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. సమస్యలపై నివేదికలు అందించాలని తక్షణమే పరిష్కారం చూపుతామని అధికారులను ఆదేశించారు.