calender_icon.png 23 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్ కూసింది.. రోడ్డు ఆగింది

23-08-2025 12:00:00 AM

  1. శంకుస్థాపన చేసిన నిర్మాణానికి నోచుకోలే..!
  2. రూ.2 కోట్ల 55 లక్షలు మంజూరంటు శంకుస్థాపన 
  3. ప్రభుత్వం మారితే రోడ్డు వేయరా..?
  4. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించాలని తాండవాసుల డిమాండ్ 

మిడ్జిల్ ఆగస్టు 19 : ఒక్కొక్క దగ్గర ఒ క్కొక్క వింత ఉంటే అది ఆ ప్రాంత ప్రత్యేకతలు అనుకోవచ్చు... ఇందుకు వినూత్న మైనటువంటి ప్రదేశాలను ప్రజలు చూసేందుకు కూడా తెగ ఆరటపడతారు. జడ్చర్ల ని యోజకవర్గం లో కూడా ఇలాంటి నూతన అధ్యాయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుం ది. గత ప్రభుత్వము శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేసిందని చెప్పిన... ప్రభుత్వం మారిన వెంటే ఈ పని మాది కాదన్నట్టు.. వివరిస్తున్నారని.. మా తాండకు రోడ్డు వేయ డం లేదని తాండవాసులు అసంతృప్తి వ్య క్తం చేస్తున్నారు.

గడచిన అసెంబ్లీ ఎన్నికల కో డ్ రావడంతో ఇక్కడ రోడ్డు పనులు నిలిచిపోయాయని తాండవాసులకు చెబుతున్నా రు. తిరిగి ప్రారంభించాల్సి ఉన్న ఆ పని జరగడం లేదంటూ అసలం వ్యక్తం చేస్తుండ్రు. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడంలో ఎవరు ముం దుంటే వారిని ప్రజలు అక్కున చేర్చుకుంటారు.

ఈ క్రమంలోనే మిడ్జిల్ మండలంలోని లింబ్యా తాండ కు రోడ్డు మం జూరు అవడంతో ఆ తండావాసులు ఎగిరి గంతేసేలా.. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తాండ ఆవిష్కృతం అ యినప్పటి నుంచి బీటి రోడ్డు ఒక కలలా ఉండేదని ఇక ఎమ్మెల్యే నే శంకుస్థాపన చేశారు కదా.. ఇక మాకు అడ్డు ఏముంటుం ది కొన్ని రోజుల్లోనే మా పాదాలు బీటీ రోడ్డుపై నడుస్తాయంటూ లింబ్యా తాండా వాసుల ఆశలు ఎన్నికల కోడ్ రాగానే అడియాశలు అయ్యాయి. 

- ట్రైబల్ వెల్ఫేర్ నిధులతో నిర్మాణం కు శంకుస్థాపన..

గడిచిన ప్రభుత్వ హయాంలో లింబ్యా తాండకు రోడ్డు మంజూరు అయ్యింది. ఈ తండాకు ట్రైబల్ వెల్పర్ నిధులతో రూ.2 కోట్ల 55 లక్షలు 4 కిలోమీటర్ల వరకు సం బంధించిన ప్రోసిడింగ్ రావడంతో శంకుస్థాపన సైతం గత ఎమ్మెల్యే చేశారు. ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ తండావాసులకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకిగా మారింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో దాదాపు 20 నెలలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం జరగటం లేదని లింబ్యా నాయక్ తండవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి....

అభివృద్ధి తమ అభిమతం అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిత్యం ప్రతి సమావేశంలోని చెబుతుంటారు. ఎక్క డ అవినీతి అక్రమాలు జరిగిన నియోజకవర్గంలో ఊరుకునేది లేదని.. వదిలేది లేదని.. స్పష్టమైన హామీలు సైతం ఇస్తుంటారు. లింబ్యా తాండా కు గత ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడమే ఈ తాండాకు శాపమయిందా అనే విధంగా తాండవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలోకి ఎవరు వచ్చినా శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు అ యినాయి అని చెప్పుకుంటూ ప్రచారం చే సిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నా రు. అభివృద్ధి ఎవరు హయాంలో చేసిన వారికి పేరు వస్తుందని, ఎన్నికల కోడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ఆపడంతో పాటు తిరిగి నిర్మించకపోవడం తీవ్ర ఆవేదన గురిచేస్తుందని తాండా వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అ నిరుద్ రెడ్డి తండాకు రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులను ఆదేశించాలని తాండ వాసులు కోరుతున్నారు.