23-08-2025 12:00:00 AM
అయిజ:ఆగష్టు 22: జిల్లా ప్రజలకు తక్షణ అవసరమైన అంశం అయిజ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరు తూ శుక్రవారం ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అర్ ఐ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా అయ న మాట్లాడుతూ అయిజ పట్టణం మండ లం, గట్టు, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి మం డలాల కలిపిన జనాభా దాదాపు 3.50 లక్ష లు ఉన్నారని .
జిల్లాలో ఒకే డివిజన్ ఉన్నందువల్ల, పరిపాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఐజను రెవిన్యూ డివిజన్ కేం ద్రంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి,ఐజ పట్టణ అధ్యక్షులు భగత్ రెడ్డి,జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.