పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
11-06-2024 12:05 AM
కలెక్టర్ షేక్ యాష్మిన్ బాషా
జగిత్యాల, జూన్ 10 (విజయక్రాంతి): పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వసతులు కల్పించా లని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో హాల్‌లో ప్రజావాణి అనంతరం పాఠశాలల ప్రారం భం, వసతుల కల్పనపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, యూనిఫామ్స్ సకాలంలో అం దించాలని కోరారు. గత విద్యాసంవత్సరం ముగింపు సమయంలో మిగిలిన బియ్యం, సరుకులు వాడకూడదని సూచించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు దివాకర, పీ రాంబాబు, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






