13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆలయ తొలిదశ అభివృద్ధి పనులు

28-03-2026 12:48 AM
  1. గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేస్తాం

దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ 

సీతారామ కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి

భద్రాచలం, మార్చి 27, (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ తెలిపారు. శుక్రవారం భద్రాచలంలోని సీతారామ చంద్ర స్వామి కల్యాణ మ హోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి కొం డా సురేఖ మీడియాతో మాట్లాడారు. భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణానికి ప్రాముఖ్యత ఉందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కల్యాణ వేడుకలను వీక్షిస్తారన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో సంవత్సరం మంత్రిగా ఈ వే డుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

రాబో యే సంవత్సరం గోదావరి పు ష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి విడత క్రింద భద్రాచలం ఆలయానికి 351 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం తో ఉన్నారన్నారు. డిప్యూటీ సీఎం, స్థానిక మంత్రుల సహకారంతో స్థానికంగా అవసరమైన భూసేకరణ చేసిన తర్వాత గోదావరి పు ష్కరాల సమయానికి ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ కృషిచేస్తుందని మంత్రి అన్నారు.

రెండ వ విడత నిధులు విడుదల చేసుకొని కృష్ణా పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి చే స్తామని మంత్రి అన్నారు.  నేడు కల్యాణ మ హోత్సవాన్ని తిలకించిన భక్తులందరికీ రామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి శ్రీరామచంద్రమూర్తి శక్తిని క ల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధు లు, తదితరులు హాజరయ్యారు.