అనంతసేన్ రెడ్డి విజయం హర్షణీయం
సూర్యాపేట, మార్చి27 (విజయక్రాంతి): రాష్ట్ర బార్ కౌన్సిల్ నాలుగో సభ్యుడిగా రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఆకుల అనంత సేన్ రెడ్డి విజయం హర్షనీయమని పలువురు సీనియర్ న్యాయవాదులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ బార్ కౌన్సిల్లో 23 మంది సభ్యులకు కోసం జరిగిన ఎన్నికల్లో 55 మంది మహిళా న్యాయవాదులతో కలిసి మొత్తం 203 మంది పోటీ చేశారన్నారు.
రెండో ప్రాధాన్య ఓట్లతో కలిసి అనంతసేన్ రెడ్డి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారన్నారు. విజయం సాధించిన అనంతసేన్ రెడ్డికి సూర్యపేట సీనియర్ న్యాయవాదులు పొదిల ప్రదీప్ కుమార్, కంచర్ల సతీష్ కుమార్, నూకల సుదర్శన్ రెడ్డి, టేకులపల్లి శ్రీనివాసరావు, మట్టి పల్లి ప్రవీణ్ కుమార్, హనుమాన్ సింగ్, రంజిత్ కుమార్ సూర్యపేట జూనియర్ న్యాయవాదులు చంద్రకాంత్, అనిల్, బాలరాజు, కట్ట సుధాకర్ సూర్యాపేట మహిళాw న్యాయవాదులు పెండెం వాణి, ముక్క సుజాత, సుస్మిత తదితర న్యాయవాదులు అభినందనలు తెలిపారు.




