26-10-2025 04:50:12 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్ డివిజన్ లోని హమాలీ బస్తిలో శ్రీ శ్రీ శ్రీ బొడ్రాయి మహోత్సవం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మరావు హాజరయ్యారు. బొడ్రాయికి కలశంతో నీళ్లు పోసి, పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు డప్పు వాయిద్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఎవరికి అపద వచ్చిన అండగా ఉండే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని, రెండు ఏండ్ల నుంచి మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసన్నారు.
ఇబ్బందులు పోవాలి అంటే అధికారంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న, మనకు మంచి రోజులు రావాలి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేయాలి.. కారుకు ఓటు వేసి మాగంటి సునితక్కను గెలిపించాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే మీ బంధువులకు, మీ దొస్తులకు చెప్పండి నవంబర్ 11 నాడు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరండని కేటీఆర్ అభ్యర్థించారు.