26-10-2025 06:54:54 PM
శ్రీరాంపూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) నూతన కమిటీని ఆది వారం ఏబీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు మండ రమాకాంత్, బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా నీరటి సురేష్, కార్యదర్శిగా కలవైన స్వామి, జాయింట్ సెక్రటరీలుగా మర్కారి క్రాంతి కుమార్, కాంపెల్లి రమేష్, బి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నామిని వెంకటేష్, మానుగు విజయ్, రమేష్, కోశాధికారిగా ఇందూరి నరేష్ లు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఐలవేణి శ్రీనివాస్, ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, బొంపల్లి రమేష్, రాజారాం కిరణ్, కటుకూరి సతీష్, జల్లా తిరుపతి, కోమ్మ బాపు, మహేందర్, బుర్ర అరుణ్ గౌడ్, బోడకుంట శ్రీధర్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.