26-10-2025 07:19:45 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలోని హనుమాన్ నగర్ లో గల భక్తాంజనేయ స్వామి గుడి పునరుద్ధరణకు సుల్తానాబాద్ కు చెందిన బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ 10,116 రూపాయలను ఆదివారం అందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి దేవాలయాలు మన హిందూత్వాన్ని కాపాడడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, సుల్తానాబాద్ రూరల్ మండలం జనరల్ సెక్రెటరీ కొల్లూరి సంతోష్ కుమార్, శేఖర్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.