26-10-2025 07:22:56 PM
అచ్చంపేట: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర ఆలయాన్ని శ్రీశైల దేవస్థానం ట్రస్టు చైర్మన్ దేవస్థానాన్ని పోతుగుంట రమేష్ నాయుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డా. గువ్వల బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, శ్రీశైలం దేవస్థానం కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కట్ట సుధాకర్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులకు కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించారు. వినాయకుడు అయ్యప్ప స్వామి మహిషాసుర మర్దిని అమ్మవార్లకు పూజలు చేశారు. ఆలయ అర్చకులు వీరయ్య శాస్త్రి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వారిని మర్యాదపూర్వకంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్, నాయకులు మంగ్య నాయక్, బాలాజీ, నాగేంద్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జానకి, వరికుప్పల ఆంజనేయులు, శంకర్, మహేందర్, కాట్రావత్ జ్యోతి తదితరులు దర్శించుకున్నారు.