26-10-2025 06:50:46 PM
ముకరంపురా (విజయక్రాంతి): ఆదివారం రోజున ప్రసారమైన ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ ను కరీంనగర్ పట్టణం విద్యానగర్ లోని 362 పోలింగ్ బూత్ కేంద్రంలో బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ దేశ ప్రజలతో మమేకమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది 127వ ఎపిసోడ్లో భారతీయ సంస్కృతి, పండుగల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, జాతీయ ఐక్యత, ఆపరేషన్ సింధూర్, జిఎస్టి వంటి అనేక అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారని తెలిపారు.
మోడీ ప్రసంగం ఈసారి పండుగలు, దేశభక్తి, సామాజిక బాధ్యత మేళావింపుగా నిలిచిందన్నారు. మన్ కీ బాత్ వీక్షించిన వారిలో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి, జిల్లా ఎలక్షన్ కన్వీనర్ బండ రమణారెడ్డి, పశ్చిమ జోన్ మాజీ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, 370 బూత్ అధ్యక్షులు, కార్యదర్శి, ఈ రెడ్డి తిరుమల్ రెడ్డి, రాయదుర్గం సోమశేఖర్, 371 పోలింగ్ బూత్ అధ్యక్షులు అబ్బిడి మాధవరెడ్డి, చందు గౌడ్ తదితరులు ఉన్నారు.