26-10-2025 07:29:53 PM
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త యాదగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజులుగా భార్యతో విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్య, ఆమె బంధువులు డబ్బులు ఇవ్వాలని నిరంతరం వేధించే వారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం తీవ్ర మనస్థాపానికి లోనై యాదగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యాదగిరి మృతికి భార్య, వారి బంధువులు కారణమని తమకు న్యాయం చేయాలని కోరారు.