26-10-2025 06:52:57 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కాకతీయ యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీల్లో పట్టణానికి చెందిన డిగ్రీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం వరంగల్ జిల్లా హనుమకొండ క్యాంపస్ గ్రౌండ్ లో నిర్వహించిన పేస్ 2 సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో మంచిర్యాల జిల్లా మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆడెపు రిషికుమార్, అంకం శ్రీకర్, ఉప్పు అఖిల్, సాయి ప్రభాస్ లు ప్రతిభ కనబరిచి మంచిర్యాల జిల్లాకు ద్వితీయ బహుమతిని తీసుకువచ్చారు. ఈ గ్రూపులో మందమర్రి పట్టణానికి చెందిన ఆడెపు రిషికుమార్, అంకం శ్రీకర్, ఉప్పు అఖిల్, సాయి ప్రభాస్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రన్నరప్ కప్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాప కులు వీరిని ప్రత్యేకంగా అభినందించారు.