26-10-2025 03:50:36 PM
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ శనివారం స్వాధీనం చేసుకుంది. డీఆర్ఐ అధికారులు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఒక ప్రయాణీకురాలిని తనిఖీ చేశారు. ఆమె సామానులో ముద్ద రూపంలో ఆకుపచ్చ రంగు పదార్థం ఉన్న ప్యాకెట్లు దొరికాయి. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఆమె లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో సుమారు రూ.4.15 కోట్ల విలువైన 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకురాలిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.