calender_icon.png 23 December, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 23న తపస్ ధర్మాగ్రహ దీక్ష

21-10-2024 01:27:35 AM

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ 

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నవంబర్ 23న ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ మేరకు ధర్మాగ్రహ దీక్ష పోస్టర్‌ను బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు.

తపస్ రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయం జరిగింది. ఉపాధ్యాయులకు అందాల్సిన పెండింగ్ బిల్లులు, డీఏ, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు.

సమావేశంలో రాష్ర్ట సహధ్యక్షులు అయిలినేని నరేందర్ రావు, అల్గుపల్లి పాపిరెడ్డి, బెండి ఉష, అదనపు ప్రధాన కార్యదర్శివర్గం బండి రమేశ్, తెల్కలపల్లి పెంటయ్య, పీ రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి లక్ష్మీకాంత్‌రావు, భాస్కర్ పాల్గొన్నారు.