14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు చొరవ తీసుకోవాలి

28-02-2026 12:10 AM

సీఎస్ కు ఎమ్మెల్యే వినతి

అలంపూర్, ఫిబ్రవరి 27: మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా పాఠశాలలలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చాలా కాలం వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లిం చే విధంగా చొరవ తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుని (ఐఏఎస్) ఎమ్మెల్యే విజయుడు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

నియోజకవర్గంలో పలు పెండింగ్ బిల్లుల మరియు పనుల గురించిన అంశాలపై చర్చించి అధికారకంగా వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ము ఖ్యంగా నియోజకవర్గంలో మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా వివిధ పాఠ శాలల్లో పట్టిన పనులకు చాలా కాలంగా బిల్లులు పెండింగ్ ఉండడంతో వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ బిల్లు లను వెంటనే క్లియర్ చేయాలని విన్నవించారు. అదేవిధంగా నిధుల కొరత మరియు ఇతర కారణాలతో ఆగిపోయిన పాఠశాలల పనులను త్వరితగతిన పునః ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. 

అనంతరం సీఎస్ సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పెండింగ్ బిల్లులను విడుదల చేసి అసంపూర్తి పనులకు సంబంధించిన చర్యలు తీసుకునే విధంగా చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ,వెంకట్రాముడు, రఘు రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.