తమిళనాడు తరహాలో మహిళా పోలీసులకు శిక్షణ
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఇతర రాష్ట్రాల్లోని మంచి పద్ధతులపై అధ్యయనానికి ఆదేశం
హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తమిళనాడు తరహాలో మహిళా పొలీసులకు శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వారిని వృత్తిపరంగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల్లో, ము ఖ్యంగా తమిళనాడు వంటి చోట్ల మహిళా పోలీసుల కోసం అమలు చేస్తున్న మంచి పద్ధతు లపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ఒక ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేయాలని, ఆ బృందం ఇచ్చే రిపోర్టు ఆధారంగా తెలంగాణలో మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, పదోన్నతుల్లో కొత్త మార్పులు తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలో మహిళల సంఖ్యను పెంచడమే కాకుండా, వారికి కీలక బాధ్యతలు అప్పగించే దిశగా శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు ముఖ్యమైన పుస్తకాలను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో నిర్వహించిన మొద టి మహిళా పోలీస్ కాన్ఫరెన్స్ విశేషాలతో కూ డిన పుస్తకంతో పాటు, తెలంగాణ పోలీస్ అకాడమీ వార్షిక పత్రికను ఆయన విడుదల చేశా రు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థలో మహిళల అభివృద్ధి కోసం సీఎం పలు కీలక ఆదేశా లు జారీ చేశారు.
సమాజంలో శాంతిభద్రతల ను కాపాడటంలో, నేరాల పరిశోధనలో ట్రాఫి క్ కంట్రోల్‌లో మహిళా పోలీసులు ఎం తో చురుగ్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీ పీ అబిలాషా బిష్త్ మహిళా పోలీసుల సమస్యలు, సీఎంకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శిఖా గోయల్, స్వాతి లక్రా ఉన్నారు.






