మెడికల్ కౌన్సిలింగ్‌లో 300మందికి అన్యాయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం
దీనిని వెంటనే సరిదిద్దాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, జూలై 19(విజయక్రాంతి): మెడికల్ కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిని వెంటనే సరిదిద్దాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే 300 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య బీసీ సం ఘాల నేతలతో కలిసి మాట్లాడారు.
గత నాలు గేళ్లుగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయింపులో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధానం లోప భూయిష్టంగా ఉందని, ఈ విధానాన్ని మార్చి గతంలో 2002 నుంచి 2020 వరకు జీవో నెంబర్ 550 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారని, తర్వాత 2021లో ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 114 ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు రెండుసార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇంతవరకు ఆ తప్పిదాన్ని సరిదిద్దలేదన్నారు.
దీంతో 300మంది అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టుకు వెళితే జీవో నెంబర్ 550 ప్రకారం అడ్మిషన్లు జరపాలని తీర్పు చెప్పిందని, హెల్త్ యూని వర్సిటీ అధికారులు ఈ తీర్పునకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావే శంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ ఐక్య కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీ అనంతయ్య, జాతీయ కన్వీనర్ సీ రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ యాదవ్, బీసీ సంఘాల నేతలు నిఖిల్ పటేల్, రఘుపతి, వంశీ యాదవ్, ఆర్కే గౌడ్, పృథ్వీగౌడ్, బీఆర్ కృష్ణ చిక్కుడు బాలయ్య, కిరణ్ కుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.






