28-11-2025 06:21:10 PM
తాండూరు,(విజయక్రాంతి): సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలవబోతున్నారని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ సంగెం కాలాన్ సర్పంచ్ అభ్యర్థిగా కామిని మీనాక్షి అనిల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై బీఆర్ఎస్ నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు. మాయ మాటలతో ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.