28-11-2025 06:16:28 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో జిఎం (సెక్యూరిటీ)గా పనిచేస్తూ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న చంద లక్ష్మినారాయణకి ఇల్లందు ఏరియాలోని వైసిఓఏ క్లబ్‌లో శుక్రవారం ఘన సన్మానం చేశారు. ఇల్లందు ఏరియా జియం వి. కృష్ణయ్య, ఇతర సెక్యూరిటీ అధికారులు, యూనియన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లందు ఏరియా జియం వి. కృష్ణయ్య మాట్లాడుతూ... జి.ఎం సెక్యూరిటీగా సింగరేణి సంస్థలో వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించారు. అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. వారి సేవలు చిరస్మరణీయాలు, శేష జీవితం సుఖ సంతోషాలతో గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.బాలరాజుని జిఎం (సెక్యూరిటీ) సి.హెచ్ లక్ష్మీనారాయణ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో జిఎం (సెక్యూరిటీ) లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. తను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి సెక్యూరిటీ విభాగ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొత్త చెక్ పోస్టుల ఏర్పాటు, జమిందార్, ఇన్స్పెక్టర్లకు ప్రమోషన్లు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్నారని, చార్జ్ తీసుకుంటున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి బాలరాజుకి కూడా అన్ని ఏరియాల సెక్యూరిటీ అధికారులు, ఇన్స్పెక్టర్లు, జమిందార్లు, సెక్యూరిటీ గార్డులు, ప్రైవేట్ గార్డులు సంపూర్ణ సహకారం అందించి సెక్యూరిటీ విభాగాన్ని పటిష్ట పరచాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధి కే సారయ్య, ఐ ఎన్ టి యు సి ప్రతినిధి జే వెంకటేశ్వర్లు, బి ఎం ఎస్ ప్రతినిధి సైదులు, ఇల్లందు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వి అంజిరెడ్డి, కార్పొరేట్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్, ఆర్ జి 1 సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, శ్రీరాంపూర్ సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి, బెల్లంపల్లి సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, మణుగూరు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, హైదరాబాద్ సింగరేణి భవన్ జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్, కొత్తగూడెం ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి, ఇల్లందు ఇన్స్పెక్టర్ సంపత్, జమిదారులు సెక్యూరిటీ గార్డ్స్ ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.