28-11-2025 06:35:31 PM
భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు...
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నూతన డిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన ఏలే మల్లికార్జున్, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావులు డిసిసి పదవి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జుక్కల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో జుక్కల్ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరస్తా నుండి పిట్లం వరకు భారీ ర్యాలీతో బయలుదేరి పిట్ల మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పని చేసే ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఎన్నిక అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరించి అత్యున్నత పదిలో కూర్చోబెట్టిన జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాటు జిల్లా నాయకులు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.