గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా వినూత్న అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్
ఆలేరు, ఆగస్టు 6: గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామంలో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు కార్యక్రమంలో పాల్గొనీ మాట్లాడారు.
గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో మూడు సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలి పారు. నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
అనంతరం అధికారులు గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించి, పాఠశాలలో మొక్కలు నాటి, ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, అదనపు డీఆర్డీఓ సురేష్, అదనపు డీఆర్డీఓ (సెర్ప్) జంగారెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యా అధికారి బిక్షపతి,మండల ప్రత్యేక అధికారి శ్యాంసుం దర్, సర్పంచ్ నాగరాణి, జిల్లా మరియు మండల సమాఖ్య అధ్యక్షులు, వార్డు సభ్యులు, సంఘ బంధ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






