7 August, 2026 | 3:14 AM

గ్రామాల సమగ్రాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

07-08-2026 02:06 AM

దామరచర్ల,ఆగస్టు6: గ్రామపంచాయతీలు గ్రామాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలవాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.దామరచర్ల లో గురువారం జరిగిన మండల పరిషత్ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు మెరుగైన సేవలందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, గ్రామపంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు, ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఏ జెండా లేకుండా సమావేశం నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారైనా ఏ జెండాతో సమావేశం నిర్వహించాలని సూచించారు.అనంతరం గృహనిర్మాణ శాఖ , ఆర్ అండ్ బి ,విద్యా శాఖ ,వ్యవసాయ శాఖ ఇలా పలు శాఖల అధికారులు చేపడుతున్న పనుల వివరాలు వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , పలు గ్రామాల సర్పంచ్ లు వివిధ శాఖల అధికారులు ,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..