7 August, 2026 | 3:16 AM

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

07-08-2026 02:02 AM

యాదగిరిగుట్ట, ఆగస్టు 6: ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను సాధించాలని, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా కొనియాడారు. జీవితాంతం స్వరాష్ట సాధన కోసం తప్పించిన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ కి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారుఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బరిగే రమ్యరామ్ చందర్,కౌన్సిల్ సభ్యులు పెరబోయిన సత్యనారాయణ ,మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, మేనేజర్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, కార్యాలయ సిబ్బంది , స్థానికులు పాల్గొన్నారు.