8 May, 2026 | 3:02 AM

వినూత్నంగా నామినేషన్ దాఖలు

26-04-2024 12:55 AM

చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 25 : దూల్‌పేట్ ఖబూతార్‌ఖానకు చెందిన అనిల్ సేన్ అనే వ్యక్తి హైదరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు. ఇందులో కొత్త ఏమి ఉంది అనుకుంటున్నారా.. అనిల్‌సేన్ రాజస్థాన్ వస్త్రధారణతో ఒంటెపై కూర్చొని ఒంటరిగా బస్తీలో తిరుగుతూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. వినూత్నంగా నామినేషన్ వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో విశే షం ఏమిటంటే అనిల్‌సేన్ గతంలో కూడా ఎమ్మెల్యేగా కార్పొరేటర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే అనుభవంతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.