13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరికి వినూత్న శిక్ష

24-03-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, మార్చి 23 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు వినూత్న శిక్ష ఖరారు చేసింది. నిబంధనల అతిక్రమణకు గానూ విధించిన జరిమానా చెల్లించడంలో విఫలమైనందుకు ఒకరికి 3 రోజుల సామాజిక సేవ, మరొకరికి 6 రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన తేజ్ సింగ్(35) కరీంనగర్ లో నివాసముంటూ హోటల్ లో పనిచేస్తున్నాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఘటనలో సోమవారం కరీంనగర్ రెండవ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ డాక్టర్ ఈదుల లక్ష్మీ విచారించారు. విచారణ అనంతరం నిందితుడికి 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే నిందితుడు జరిమానా మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో మార్చి ఈనెల 23 నుండి 27 వరకు 3 రోజుల పాటు సామాజిక సేవ చేయాలని తీర్పునిచ్చారు.