calender_icon.png 10 January, 2026 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వినూత్న శిక్ష

08-01-2026 12:28:24 AM

జైలు బదులు కమ్యూనిటీ సర్వీస్

ఎస్‌ఆర్ నగర్, జనవరి 7 (విజయక్రాంతి):- నూతన సంవత్సర వేడుకల సం దర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయస్థానం వినూత్నమైన శిక్షను విధించింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 20 మంది ద్విచక్ర వాహనదారులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన గౌరవ న్యాయస్థానం, జైలు శిక్షకు బదులుగా సమాజానికి మేలు చేసే విధంగా ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మద్యం సేవించి వాహ నాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. మైత్రీవనం జంక్షన్ వద్ద అవగాహన కార్యక్రమం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం అమీర్‌పేట్, మైత్రీవనం జంక్షన్ వద్ద శిక్ష పడిన వాహనదారులు కమ్యూనిటీ సర్వీస్‌లో పాల్గొన్నారు.