calender_icon.png 10 January, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం

08-01-2026 12:27:31 AM

ది నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు

ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని నేషనల్ అంబేడ్కర్ సేన, మాల మహానాడు నేతలు ఆరోపించారు. ఈ మేర కు బుధవారం హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్ సెంటర్‌లో నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రూప్3లో ఉన్న 26 కులాలకు రోస్టర్ పాయింట్ను 22గా నిర్ణయించడం రాజ్యాం గ విరుద్ధమని పేర్కొన్నారు.

పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రోస్టర్ పాయింట్ను 22 నుంచి16కు సవరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తాలూక రాజేశ్, గిరిజా శంకర్, వినయ్ కుమార్, కమల్ కుమార్, సుజాత స్వప్న తదితరులు పాల్గొన్నారు.