calender_icon.png 10 January, 2026 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక

08-01-2026 12:28:53 AM

మంచిర్యాల టౌన్, జనవరి 7: నల్గొండలో ఇటీవల జరిగిన జూనియర్ బాలుర రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు జాడే అచల్ కుమార్, జుమీడే రవివర్మలు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోనె శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేష్ లు తెలిపారు. మంచిర్యాల పట్టణానికి చెందిన అచల్ కుమార్, కోటపల్లి మండలానికి చెందిన రవివర్మ లు నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి బాలుర హ్యాండ్ బాల్ ఛాంపియన్ పోటీల్లో  జట్టుకు ప్రాతినిధ్య వహించి జిల్లా జట్టు గెలుపు లో భాగమయ్యారు.

వారి క్రీడా నైపుణ్యాన్ని, ప్రతిభను గమనించిన రాష్ట్ర సెలక్షన్ కమిటీ జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణం అని పేర్కొన్నారు. వీరు ఈ నెల 10 నుంచి 15 వరకు ఢిల్లీలోని ప్రీతంపురలో జరుగనున్న జాతీయ స్థాయి జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటిల్లో ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు.

జాతీయ స్థాయి పోటీ లకు ఎంపికైన  అచల్ కుమార్, రవివర్మలతో పాటు కోచ్ లు అరవింద్ సునార్కర్, దుర్గం రాజలింగులను మంచిర్యాలలో జిల్లా అధ్యక్షులు గోనే శ్యామ్ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, కోశాధికారి అలుగువెల్లి రమేష్ రెడ్డిలు మిఠాయిలు తినిపించి అభినందించారు. వీరికి శిక్షణ ఇచ్చిన  అభినందించారు. జాతీయ స్థాయికి జిల్లా క్రీడాకా రులు ఎంపిక కావడం పట్ల ఒలింపిక్ కార్యదర్శి రఘునాధ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా డి వై ఎస్ ఓ హనుమంత రెడ్డి, పి డి లు రోజా వరకుమారి, శి్రంగి గోపాల్, గాజుల శ్రీనివాస్, ఫ్రాన్సిస్ అభినందనలు తెలిపారు.