calender_icon.png 15 July, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనాలు ఇప్పించాలని వినూత్నంగా కార్మికుల నిరసన

16-09-2024 01:01:23 AM

సర్కార్ దవాఖానల ముందు భిక్షాటన

కామారెడ్డి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సర్కార్ ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆయా దవాఖానల ఎదుట సిబ్బంది ఆదివారం వినూత్నంగా నిరసన చేపట్టారు. దవాఖానల ఎదుట భిక్షాటన చేసి మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామన్నారు. అప్పుల పాలు అవుతున్నామన్నారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు సర్కార్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వారికి ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు.