calender_icon.png 7 February, 2026 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది పనితీరుపై అధికారులతో ఆరా

07-02-2026 08:27:07 PM

- విధులు, బాధ్యతలను గుర్తు చేసిన  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): కలెక్టరేట్ కార్యాలయంలోని పలు వివిధ శాఖల కార్యాలయాలను కలెక్టర్‌ రాహుల్ రాజ్  శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్ఐసీ కార్యాలయంతో పాటు డిఆర్డిఓ, సివిల్ సప్లై, సంక్షేమ శాఖ, కార్యాలయాలను పరిశీలిస్తూ అధికారులు, సిబ్బంది పనితీరును ఆరా తీశారు. కార్యాలయాల్లో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతూ ఆ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యాలయాలు  పరిశీలనలో కలెక్టర్ వెంట డిఆర్ఓ భుజంగరావు, డిఆర్డిఓ శ్రీనివాసరావు, ఏవో యూనస్, సూపరిండెంట్ రవీందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు