8 August, 2026 | 1:18 AM

ఏ చిన్న ఇబ్బంది రావొద్దు

08-08-2026 12:00 AM

నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

వరుణయాగం ఏర్పాట్ల పరిశీలన                                                            

నల్లగొండ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): వరుణయాగం ఏర్పా ట్లు పకడ్బందీగా ఉండాలని, ఏ చిన్న సమస్య రావొద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ వద్ద ఈనెల 10న నిర్వహించనున్న మహా వరుణయాగం ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. యాగశాల, ప్రవచనశాల, భారికేడింగ్, పగోడాలు, టెంట్లు, ఎల్‌ఈడీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితర ఏర్పాట్లపై దేవాదాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చించి వారికి సూచనలు చేశారు.

రుత్వికులు, అర్చకులకు వసతి, భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వ్రతశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ప్రముఖులు, సాధారణ ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తుతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఏర్పాట్లు సకాలంలో పూర్తి కావాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రమేష్, ఆర్డీవో రమ, డీఎస్పీ రవి, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.