15 April, 2026 | 11:08 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

01-11-2025 12:00 AM

బాన్సువాడ, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండ లంలోని సంగోజిపేట, హనుమాజీపేట్, కోనాపూర్ తదితర గ్రామాలలో శుక్రవారం ఆరబెట్టిన వరి పంటను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్నీ పరిశీలించి పూర్తిగా తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఎండిన వడ్లను త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని సొసైటీ సిబ్బందికి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. ఎస్ ఓ. వెంకటేశ్వర రావు,డి. టి. శరిపొద్దీన్, బొర్లం సి ఇ ఓ సురేందర్ రావు, రైతులు పాల్గొన్నారు.