31-10-2025 11:15:08 PM
ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి!!
శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలో ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రన్ పర్ యూనిటీ 2 కే ర్యాలీ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు పోలీస్ స్టేషన్ నిలయం ముందు నుండి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం శివంపేట మండల ఎస్సై మధుకర్ రెడ్డి మాట్లాడుతూ మనమంతా కలసి దేశా ఐక్యత, సోదర భావం, ఆరోగ్య జీవన విధానం పట్ల జాగ్రత్తతో నడిచే సమాజం సృష్టించుకుందాం మనమందరం మన దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎస్సై మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు, చింతల కర్ణాకర్ రెడ్డి, , మండల మైనార్టీ యువ నాయకులు షేక్ అలీ, శివంపేట గ్రామ యువకులు, మరియు పోలీస్ సిబ్బంది, శివంపేట ఎస్టివసతి గృహం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.