01-11-2025 12:00:00 AM
కేసు విత్ డ్రా చేసుకున్న పర్యావరణ వేత్తలు
వివరాలు వెల్లడించిన రామ్మోహన్ రెడ్డి. యాదయ్య
చేవెళ్ల, అక్టోబర్ 31: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేషనల్ హైవే పనులకు అడ్డంకులు తొలగిపోయాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న రోడ్డు పనులకు మోక్షం లభించిందని అన్నారు.
మర్రి చెట్ల విషయంలో ఎన్జీటీ లో కేసు కారణంగా ఇన్నాళ్లు హైదరాబాదు- బీజాపూర్ హైవే పనులు ఆగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పర్యావరణ వేత్తలతో పలుమార్లు చర్చలు జరిపి విత్ డ్రా చేసుకోవాలని కోరామని, అందుకు వాళ్లు అంగీకరించారని తెలిపారు. 915 మర్రి చెట్లలో కేవలం 150 చెట్లు రీ లొకేట్ చేస్తే సరిపోతుందని రీ డిజైన్ చేయడంతో వాళ్లు కేసు విత్ డ్రా కు ముందుకు వచ్చారని వెల్లడించారు.
ఈ మేరకు రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, ముడిమ్యాల పిఎసిఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి గోనె ప్రతాపరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, మాజీ సర్పంచులు గోపాల్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, పడాల ప్రభాకర్, నర్సింలు, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాండు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.