15 April, 2026 | 6:35 AM

నూతన వీడీసీసీ రోడ్డు పనుల పరిశీలన

16-11-2025 12:00 AM

పర్యవేక్షించిన కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని కెనరా బ్యాంక్, అబ్బాయి టిఫెన్స్, సూరజ్ ఫాస్ట్ ఫుడ్, మలయాళం చర్చ్, లేబర్ ఆఫీసు, టెలిఫోన్ ఎక్చేంజి ప్రక్కన లేన్ల వద్ద చేపట్టిన నూతన విడిసిసి రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను శనివారం జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు.

స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా మొదలు పెట్టిన పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. వీటితో పాటు డివిజన్ లో పెండింగ్ లో వున్న మరి కొన్ని రోడ్డు నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామని, డివిజన్ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను ప్యాచ్ వరక్స్ ద్వారా అవసరం వున్న చోట నూతన రోడ్డు నిర్మాణం పనుల పై ప్రత్యేక దృష్టి వహించి అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికిం ద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బిజెపి సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్ ఎం. ఉమేష్, సురేష్ రాజు, మహమూద్, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.