calender_icon.png 17 November, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తెలంగాణ సౌర రైతుల సాధికార సమ్మేళనం

16-11-2025 12:00:00 AM

తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ ఆసోసియేషన్

ఖైరతాబాద్; నవంబర్ 15 (విజయ క్రాంతి) :  పీఎం కుసుమ్ ఫార్మర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ సౌర రైతుల సాధికార సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అడ్వయిజర్ సంతోష్ రావు తెలిపారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబం ధించిన కరపత్రాలను ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి. రమేశ్, కార్యవర్గ సభ్యుడు రాజ్కృష్ణతో కలిసి ఆవిష్క రించారు.

అనంతరం సంతోష్ రావు మాట్లాడుతూ.. 2019లో ప్రారంభించిన పీఎం కుసుమ్ పథకం ద్వారా అనేక మంది సౌర రైతులకు ఆర్థిక స్వావలంభన లబించిందన్నారు. ఈ పథకం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూము లు కలిగిన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నా రు. అలాగే సోలార్ రేడియేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు.

ఒక రైతు కాని, ఫార్మర్ సొసైటీకి హాఫ్ మెగావాట్ నుంచి 2 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఒక మెగావాట్ ఉత్పత్తి చేయాలంటే సుమారు మూడున్నర నుంచి నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. 25 ఏండ్ల కాలపరిమితి కలిగి ఈ పథకంలో యూనిట్కు రూ.3.13 ధరను డిస్కమ్ నుంచి చెల్లిస్తుందని, నాబార్డు నుంచి రైతుకు వడ్డీ రాయితీ కూడా ఉంటుందని, బ్యాంకులో రుణ సౌకర్యం కూడా ఉంటుందన్నారు.

ఒక మెగా వాట్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలంటే రూ.4కోట్ల వ్యయమవుతుందని, బ్యాంకర్లు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తే మిగతా మొత్తం రుణం లబిస్తుందన్నారు. ప్రాజెక్టు కోసం వినియోగించే భూమిని మార్టిగేజ్ చేయాల్సి ఉంటుందన్నారు. రాజస్థాన్లాంటి రాష్ట్రాల్లో సత్ఫలితా లనిస్తోందన్నారు.

ఈ పథకం ప్రకటించిన క్రమంలో తెలంగాణ నుంచి వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 883 మంది రైతులు అర్హత సాదించారన్నారు. వారికి డిస్కమ్తో ఒప్పందం కుదిరిందన్నారు. 16, 17న జరిగే సమ్మేళనంంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పరికరాలను ప్రదర్శిస్తున్నామని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు వస్తున్నారని తెలిపారు.

సోలార్ ప్లాంట్ పెట్టాలంటే భూమి సర్వే, లీగల్ డాక్యుమెంటేషన్, వాల్యూయేషన్, సాయిల్ సాంపిల్ తదితర ప్రక్రియలుంటాయని, వాటిపై టీఎస్డ్కో, డిస్కమ్ నిపుణులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిధులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు.